Afghanistan: తాలిబన్‌కు ఆన్‌లైన్‌లో ఎదురుదెబ్బ.. ఆఫ్‌లైన్‌లోకి 5 వెబ్‌సైట్లు

తాజా వార్తలు

Published : 22/08/2021 10:41 IST

Afghanistan: తాలిబన్‌కు ఆన్‌లైన్‌లో ఎదురుదెబ్బ.. ఆఫ్‌లైన్‌లోకి 5 వెబ్‌సైట్లు

 

శాన్‌ ఫ్రాన్సిస్కో: తాలిబన్‌కు ఆన్‌లైన్‌ వేదికపై ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఆంగ్లం సహా ఆ సంస్థకు చెందిన ఐదు భాషల్లోని అధికారిక వెబ్‌సైట్లు శనివారం ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయి. అఫ్గాన్‌లో తిరుగుబాటు, విజయానికి సంబంధించిన సందేశాలు అందులో ఉన్నాయి. అయితే, ఏ కారణంతో అవన్నీ ఆఫ్‌లైన్‌లోకి  వెళ్లాయన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ వెబ్‌సైట్లకు శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న కంటెంట్‌ ప్రొవైడర్‌ నెట్‌వర్క్‌ సంస్థ క్లౌడ్‌ఫేర్‌ ఇంతకాలం భద్రత కల్పిస్తూ వచ్చింది. తాజా పరిణామంపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించలేదు. మరోవైపు... ఫేస్‌బుక్‌ బాటలోనే వాట్సప్‌ కూడా తాలిబన్లకు చెందిన చాలా గ్రూపులను తొలగించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని