Rajya Sabha: సభాపక్ష నేతగా పీయూష్ గోయల్‌!

తాజా వార్తలు

Updated : 14/07/2021 17:25 IST

Rajya Sabha: సభాపక్ష నేతగా పీయూష్ గోయల్‌!

వెల్లడించిన పార్టీ వర్గాలు

దిల్లీ: కేంద్ర మంత్రి, భాజపా సీనియర్ నేత పీయూష్ గోయల్ రాజ్యసభలో సభాపక్ష నేతగా నియమితులైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఎగువ సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరో నేత థావర్‌ చంద్‌ గహ్లోత్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉంది. ఇటీవల గహ్లోత్‌ కర్ణాటక గవర్నర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. 

పీయూష్ గోయల్‌ మహారాష్ట్రకు చెందిన భాజపా నేత. ఇటీవల జరిగిన కేబినెట్‌ విస్తరణలో భాగంగా వాణిజ్య, పరిశ్రమల శాఖతో పాటు మరో రెండు శాఖలు ఈయన ఆధ్వర్యంలోనే ఉన్నాయి. అలాగే త్రిపుల్ తలాక్‌, ఆర్టికల్ 370 వంటి బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందడంలో గోయల్ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ప్రతిపక్షపార్టీ నేతలతో కూడా ఈయన మంచి సంబంధాలు కలిగిఉన్నారు. 

మొదట ఈ పదవికి కార్మిక శాఖ కొత్త మంత్రి భూపేంద్ర యాదవ్ పేరు వినిపించింది. పార్లమెంటరీ కార్యకలాపాల నిబంధనలపై పట్టున్న ఆయనకు ఈ పదవి దక్కుతుందని అంతా భావించారు. అయితే ఇప్పుడు ఆయన రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమితులు కావొచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. జులై 19 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఈ కొత్త నియామకానికి సంబంధించిన వివరాలను రాజ్యసభ సెక్రటేరియట్‌కు అందించినట్లు తెలిపాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని