Bonus: గ్రూప్‌ బి, సి ఉద్యోగులకు 30 రోజుల బోనస్‌

తాజా వార్తలు

Updated : 19/10/2021 07:00 IST

Bonus: గ్రూప్‌ బి, సి ఉద్యోగులకు 30 రోజుల బోనస్‌

ఈనాడు, దిల్లీ: ఉత్పాదక ఆధారిత బోనస్‌ పరిధిలోకి రాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 రోజుల అనుత్పాదక ఆధారిత బోనస్‌ను ప్రకటిస్తూ కేంద్ర ఆర్థికశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రూప్‌-బి కిందికి వచ్చే నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులందరితోపాటు, గ్రూప్‌-సి ఉద్యోగులకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. రూ.7వేల నెలవారీ జీతం ఆధారంగా ఈ బోనస్‌ను లెక్కించి ఇస్తారు. కేంద్ర పారామిలిటరీ దళాలు, సాయుధ దళాల్లోని అర్హులైన ఉద్యోగులకూ ఈ బోనస్‌ వర్తిస్తుందని ఆర్థికశాఖ పేర్కొంది. 2021 మార్చి 31 నాటికి సర్వీసులో ఉండి, 2020-21 ఆర్థిక సంవత్సరంలో కనీసం ఆరునెలల సర్వీసు ఉన్నవారు మాత్రమే ఈ బోనస్‌ పొందడానికి అర్హులని వెల్లడించింది. ఆర్థికశాఖ లెక్కల ప్రకారం అర్హులైన ఉద్యోగులు ఒక్కొక్కరికి రూ.6,907.89 బోనస్‌ రానుంది.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని