Zika virus: కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్‌

తాజా వార్తలు

Published : 15/07/2021 11:09 IST

Zika virus: కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్‌

28కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

తిరువనంతపురం: కరోనా కేసులతో సతమతమవుతోన్న కేరళను జికా వైరస్ వేధిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 28కి చేరినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. 

జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటివరకు మందులేకపోవడం ఆందోళన కలిగించే విషయం. దీని బారిన పడినవారిలో జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

మరోవైపు, కేరళలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆ రాష్ట్రం మొదట్లో వైరస్‌ను కట్టడి చేసి ఆదర్శంగా నిలిచింది. కానీ, రెండోవేవ్‌లో మాత్రం భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూశాయి. తర్వాత అవి తగ్గినట్టే తగ్గి మరోసారి పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి జులై 17, 18 తేదీల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తాజాగా అక్కడ 15వేలమందికి వైరస్ సోకింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని