కరోనా సంక్షోభం.. సర్వం ‘శానిటైజర్‌’ మయం 

తాజా వార్తలు

Updated : 18/07/2021 16:39 IST

కరోనా సంక్షోభం.. సర్వం ‘శానిటైజర్‌’ మయం 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి మనకు చాలా అలవాట్లు, పద్ధతులను నేర్పింది. వాటిల్లో కొన్నింటిని మరచిపోవడం కష్టం. ముఖ్యంగా క్రమం తప్పకుండా చేతులు శానిటైజ్‌ చేసుకోవడం, పరిశుభ్రంగా ఉండడం వంటి వాటి ప్రాముఖ్యత తెలుసుకున్నాం. మాల్స్‌ నుంచి రెస్టారెంట్ల వరకు ఎక్కడికెళ్లినా శానిటైజర్‌ దర్శనమివ్వడం పక్కా. ఇక ఈ మహమ్మారి సమయంలో పుట్టిన పిల్లలు.. వారి తల్లిదండ్రులు, పెద్దలు నిత్యం చేతులను శానిటైజ్‌ చేసుకుంటూ ఉండటాన్ని చూస్తూ పెరిగారు. ఆ బుడతలు కూడా అదే అలవాటు చేసుకున్నారు. ఎంతలా అంటే.. 2020లో జన్మించిన ఓ చిన్నారి.. చూసిన ప్రతీదీ శానిటైజర్‌ అనే అనుకుంటోంది. వీధి దీపాల నుంచి విద్యుత్‌ సర్క్యూట్‌ల వరకు ప్రతి దాన్ని శానిటైజర్‌గా పొరబడి, దాని ముందు చేతులు చాస్తోంది. ఎంతో ముద్దుగా ఉన్న ఈ వీడియో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దానికి 18 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని