Water vapor on Jupiters moon: గురు గ్రహ చందమామపై నీటి ఆవిరి

తాజా వార్తలు

Updated : 28/07/2021 12:28 IST

Water vapor on Jupiters moon: గురు గ్రహ చందమామపై నీటి ఆవిరి

తొలిసారిగా గుర్తించిన హబుల్‌ టెలిస్కోపు

వాషింగ్టన్‌: గురుగ్రహం చందమామ ‘గానీమీడ్‌’ వాతావరణంలో నీటి ఆవిరి ఉనికిని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన హబుల్‌ టెలిస్కోపు అందించిన తాజా, పాత డేటాను విశ్లేషించి ఈ మేరకు తేల్చారు. ఆ ఉపగ్రహ ఉపరితలం మీదున్న ఐసు.. ఘన రూపం నుంచి నేరుగా వాయు రూపంలోకి మారినప్పుడు నీటి ఆవిరి ఏర్పడుతున్నట్లు గుర్తించారు. సౌర కుటుంబంలోని చందమామలన్నింటిలోకి గానీమీడ్‌ అతిపెద్దది. భూమి మీదున్న మహాసాగరాల్లో ఉన్న మొత్తం నీటి కన్నా ఈ చందమామలోనే ఎక్కువ నీరు ఉండొచ్చని మునుపటి పరిశోధనలు కొన్ని ఆధారాలను అందించాయి. అయితే తీవ్ర శీతల పరిస్థితుల వల్ల అక్కడి ఉపరితలం మీద నీరు ఘనీభవించి ఉందని నాసా పేర్కొంది. గానీమీడ్‌ ఉపరితలానికి సుమారు 160 కిలోమీటర్ల కింద మహాసముద్రం ఉంది. అందువల్ల అక్కడి వాతావరణంలోని నీటి ఆవిరి.. ఆ సాగరం నుంచి వచ్చింది కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. హబుల్‌ టెలిస్కోపులోని ఇమేజింగ్‌ స్పెక్ట్రోగ్రాఫ్, కాస్మిక్‌ ఆరిజిన్స్‌ స్పెక్ట్రోగ్రాఫ్‌ సాధనాలు తీసిన పాత, కొత్త చిత్రాలను పరిశీలించినప్పుడు.. విద్యుదావేశంతో కూడిన వాయు పట్టీలు కనిపించాయి. దీన్ని బట్టి ఈ చందమామకు బలహీన అయస్కాంత క్షేత్రం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే.. రోజు మొత్తంలో ఈ చందమామ ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీగా వైరుధ్యాలు ఉంటున్నట్లు గమనించారు. మధ్యాహ్న సమయంలో అక్కడి మధ్యరేఖా ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా ఉపరితలం మీదున్న మంచు స్వల్ప పరిమాణంలో నీటి అణువులను ఆవిరి రూపంలో విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. గానీమేడ్‌ వాతావరణంలో అటామిక్‌ ఆక్సిజన్‌ (ఒ) పెద్దగా లేదని, మాలిక్యులర్‌ ఆక్సిజన్‌ (ఒ2) మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మంచు ఉపరితలంపై ఆవేశిత రేణువులు క్షీణించినప్పుడు ఇది ఉత్పత్తవుతోందని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని