Zomato: క్షమాపణ కోరిన జొమాటో సంస్థ

తాజా వార్తలు

Updated : 20/10/2021 09:21 IST

Zomato: క్షమాపణ కోరిన జొమాటో సంస్థ

హిందీ తెలిసి ఉండాలన్న ఉద్యోగిపై చర్యలు

సైదాపేట, న్యూస్‌టుడే: అందరికీ హిందీ తెలిసి ఉండాలంటూ జొమాటో సంస్థ ఉద్యోగి వ్యక్తం చేసిన అభిప్రాయంపై ఆ సంస్థ మంగళవారం క్షమాపణ చెప్పింది. తమిళనాడుకు చెందిన ఆకాశ్‌ సోమవారం జొమాటోలో ఆహారం ఆర్డర్‌ చేసి తెప్పించుకున్నారు. అయితే తప్పుగా డెలివరీ చేసినట్లు కస్టమర్‌ కేర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. అప్పుడు సదరు ఉద్యోగితో తనకి హిందీ తెలియదని ఆకాశ్‌ తెలిపారు. హిందీ జాతీయ భాష అయినందున అందరికీ తెలిసుండాలని జొమాటో ఉద్యోగి అనడంతో.. ఈ సంభాషణను ఆకాశ్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. దీనిపై సోమవారం నుంచి అనేకమంది ఆ సంస్థకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆ సంస్థ ఆకాశ్‌కు క్షమాపణ చెప్పింది. సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించామని వివరణ ఇచ్చింది. కోయంబత్తూరులో తమిళ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని