Corona : 2 లక్షల దిగువకు క్రియాశీల కేసులు..

తాజా వార్తలు

Updated : 17/10/2021 11:59 IST

Corona : 2 లక్షల దిగువకు క్రియాశీల కేసులు..

దిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా కొత్త కేసులు 14 వేలకు దిగి రావడం ఊరట కలిగిస్తోంది. ఇక మరణాలు కూడా 150లోపే నమోదయ్యాయి. మరోవైపు  రికవరీలు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 2 లక్షల దిగువకు పడిపోయాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* గడిచిన 24 గంటల్లో 11 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,146 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇవి 229 రోజుల కనిష్ఠానికి చేరాయి.

* నిన్న 144 మరణాలు చోటుచేసుకోగా.. కొవిడ్‌తో ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 4,52,124కి చేరింది.

* గడిచిన 24 గంటల్లో 19,788 మంది కొవిడ్‌ను జయించారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 3,34,19,749కి పెరిగి  రికవరీ రేటు 98.10 శాతానికి చేరింది. గతేడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి.

* ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,95,846కి పడిపోయాయి. ఇక  ఆ రేటు 0.57 శాతానికి  తగ్గి 220 రోజుల కనిష్ఠానికి చేరడం సానుకూలాంశం.

* ఇక టీకా డోసుల సంఖ్య వంద కోట్ల వైపు పరుగులు తీస్తోంది. నిన్న 41,20,772 మందికి టీకాలు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన డోసుల సంఖ్య 97.65 కోట్లు దాటింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని