Adar Poonawalla: భారత్‌లో బూస్టర్‌ డోసు.. పూనావాలా ఏమన్నారంటే..?

తాజా వార్తలు

Published : 21/10/2021 19:14 IST

Adar Poonawalla: భారత్‌లో బూస్టర్‌ డోసు.. పూనావాలా ఏమన్నారంటే..?

దిల్లీ: కరోనా టీకా కార్యక్రమంలో 100 కోట్ల డోసుల పంపిణీ ఒక కీలక మైలురాయని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పునావాలా అన్నారు. రానున్న రోజుల్లో టీకా పంపిణీ వేగం మరింత పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. బూస్టర్ డోసు గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

వచ్చే ఏడాది ప్రారంభానికి బూస్టర్ డోసు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పూనావాలా అన్నారు. ‘నైతికంగా, మానవతా దృక్ఫథంతో ఆలోచిస్తే.. ప్రపంచ దేశాలకు మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు ముందుగా రెండు డోసుల టీకా అందాలి. ఆఫ్రికా మొత్తం కనీసం మూడు శాతం మందికి కూడా టీకాలు అందలేదు. ఇక్కడ మాత్రం రెండు డోసులు తర్వాత బూస్టర్ డోసు గురించి మాట్లాడుతున్నారు. అయితే వృద్ధులకు, ప్రమాదం పొంచి ఉన్నవారికోసం తగినన్నీ బూస్టర్ డోసులు అందుబాటులో ఉంచుతాం. అయితే యువకులు, ఆరోగ్యవంతుల విషయంలో మిగిలిన ప్రపంచం రెండు డోసులు పొందేవరకు వేచి ఉండాల్సి ఉంది’ అని అదర్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న ఉత్పత్తి వేగంతో ఈ ఏడాది చివరి నాటికి రెండు డోసులు పొందిన వారి సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. 

అలాగే భారీ జనాభా గల భారత్‌ ఈ ఫీట్ సాధించడం వెనుక ఘనత ప్రధాని మోదీకే చెందుతుందన్నారు. 100 కోట్ల డోసుల పంపిణీ అతిపెద్ద మైలురాయే అయినా.. ప్రజలు మాత్రం కొవిడ్ నియమాల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని అభ్యర్థించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని