Women in NDA: అవివాహిత మహిళల దరఖాస్తునకు యూపీఎస్‌సీ అనుమతి

తాజా వార్తలు

Published : 24/09/2021 22:06 IST

Women in NDA: అవివాహిత మహిళల దరఖాస్తునకు యూపీఎస్‌సీ అనుమతి

దిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ), నావల్ అకాడమీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారం మహిళలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) అనుమతి ఇచ్చింది. ఈ ఉద్యోగాల భర్తీకి అవివాహిత మహిళలకు అవకాశం కల్పించింది. గత నెల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా యూపీఎస్‌సీ నుంచి ఈ ప్రకటన వెలువడింది. 

upsconline.nic.in వెబ్‌సైట్‌లో మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు కమిషన్ మార్గం సుగమం చేసింది. అలాగే అవివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేసింది. శారీరక ప్రమాణాలు, మహిళల పోస్టులకు సంబంధించి ఖాళీ వివరాలను రక్షణ శాఖ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా వెల్లడించనుంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 8 సాయంత్రం ఆరు గంటలవరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ‘మహిళా అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు’ అని ఆ ప్రకటనలో యూపీఎస్‌సీ పేర్కొంది. అభ్యర్థులు నవంబర్ 14న పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. 

సైన్యంలో చేరడానికి ఉద్దేశించిన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రవేశపరీక్షల్లో మహిళలు పాల్గొనడానికి గతనెల సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఈ పరీక్షల్లో మహిళా అభ్యర్థులు పాల్గొనడానికి వీలుగా నోటిఫికేషన్‌ ఇచ్చి తగిన ఏర్పాట్లు చేయాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ను ఆదేశించింది. అయితే పరీక్షల ఫలితాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయంటూ వెల్లడించింది. ఈ పరీక్షల్ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని ఇటీవల కేంద్రం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. మహిళలకు దక్కాల్సిన హక్కుల్ని నిరాకరించలేమని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే యూపీఎస్‌సీ నుంచి ప్రకటన వెలువడింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని