Govt Jobs: 8.72లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ

తాజా వార్తలు

Published : 29/07/2021 20:06 IST

Govt Jobs: 8.72లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ

దిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు 8.72లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ గురువారం వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2020 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మొత్తం 40,04,941 పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 31,32,698 ఉద్యోగులు ఉన్నట్లు ఆయన తెలిపారు. 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా గత ఐదేళ్లలో కేంద్రం చేపట్టిన నియామకాలపైనా కేంద్రమంత్రి వివరణ ఇచ్చారు. 2016-17 నుంచి 2020-21 వరకు యూపీఎస్‌సీ ద్వారా 25,267, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ద్వారా 2,14,601, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డుల(ఆర్‌ఆర్‌బీ) ద్వారా 2,04,945 మందిని కొత్తగా కేంద్ర ప్రభుత్వ విధుల్లోకి తీసుకున్నట్లు జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని