ఆయనే రిమోట్ కంట్రోల్‌..అనుమానం లేదు 

తాజా వార్తలు

Published : 15/07/2021 21:45 IST

ఆయనే రిమోట్ కంట్రోల్‌..అనుమానం లేదు 

ఎంవీఏపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

ముంబయి: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం మహా వికాస్ అగాడీ(ఎంవీఏ)లోని అసంతృప్తి ఏదో ఒక రూపంలోని బయటపడుతూనే ఉంది. తాజాగా ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్ నానా పటోలే మాట్లాడుతూ.. శరద్ పవార్‌ను ఎంవీఏ రిమోట్‌ కంట్రోల్‌గా అభివర్ణించారు. ఆ తర్వాత తన విమర్శల అసలు ఉద్దేశాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. 

‘మహారాష్ట్ర ప్రభుత్వానికి రిమోట్ కంట్రోల్‌ శరద్ పవారే. అందులో అనుమానమే లేదు. ఆయన ఎన్‌సీపీ అధినేత. నేను మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని. మేం మా పార్టీలను బలోపేతం చేయడానికి కృషి చేస్తుంటాం. ఆయనే మహా వికాస్ అగాడీ రిమోట్ కంట్రోల్. అంతేకాకుండా ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ఆయనది కీలకపాత్ర. ఆయన మాకు మార్గనిర్దేశం చేస్తారు. అందుకే ఆయన్ను రిమోట్ కంట్రోల్ అన్నాను’ అంటూ నానా పటోలే వ్యాఖ్యలు చేశారు. 

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ పడుతుందంటూ ఇటీవల నానా పటోలే చేసిన వ్యాఖ్యలపై కూటమిలోని పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. 2019లో కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన  కలిసి మహా వికాస్ అగాడీని ఏర్పాటు చేశాయి. ఇవి సైద్ధాంతికంగా భిన్నమైన పార్టీలు. ఇదిలా ఉండగా, ఈ వ్యాఖ్యలపై శరద్‌ పవార్‌ స్పందిస్తూ.. ‘సోనియా గాంధీ ఏదైనా మాట్లాడితే.. నేను దానికి స్పందిస్తా. ఇలాంటి వాళ్లకు కాదు’ అంటూ బదులిచ్చారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని