Covaxin: ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌పై కొవాగ్జిన్‌ భేష్‌

తాజా వార్తలు

Published : 02/08/2021 14:18 IST

Covaxin: ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌పై కొవాగ్జిన్‌ భేష్‌

దిల్లీ: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకా డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దేశంలో కరోనా ఉద్ధృతి, వ్యాక్సిన్ల పనితీరుపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ఓ అధ్యయనం చేపట్టింది. భారత్‌లో కరోనా రెండో దశ ఉద్ధృతికి కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్‌ నుంచి కొవాగ్జిన్‌ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోంది, దీంతో పాటు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను కూడా ఈ వ్యాక్సిన్‌ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్‌ తెలిపింది. 

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు గానూ.. ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాకు 77.8శాతం సమర్థత ఉన్నట్లు ఇటీవల మూడో దశ క్లినికల్‌ పరీక్షల తుది విశ్లేషణలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ టీకా తీసుకుంటే ప్రాణాంతక కరోనా వైరస్‌- డెల్టా వేరియంట్‌ నుంచి 65.2 శాతం రక్షణ ఉంటుందని తేలింది. తీవ్రమైన కొవిడ్‌-19 రాకుండా 93.4 శాతం మేరకు నిరోధిస్తుందని, వ్యాధి సోకినప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించని (అసింప్టమ్యాటిక్‌ కొవిడ్‌-19) వారికి సైతం 63.6 శాతం మేర రక్షణ ఉంటుందని వెల్లడైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని