PM Modi: విధ్వంసక శక్తుల ఆధిపత్యం శాశ్వతం కాదు..!

తాజా వార్తలు

Updated : 20/08/2021 18:31 IST

PM Modi: విధ్వంసక శక్తుల ఆధిపత్యం శాశ్వతం కాదు..!

అఫ్గానిస్థాన్‌ పరిణామాలపై మోదీ పరోక్ష స్పందన

దిల్లీ: విధ్వంసక శక్తులు, తీవ్రవాద భావజాలంతో రాజ్యాలను పాలించేవారు వారి ఆధిపత్యాన్ని కొంతకాలం మాత్రమే చలాయించగలరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అలాంటివారు మానవజాతిని ఎన్నటికీ అణచివేయలేరని.. అందుకే వారి ఉనికి శాశ్వతం కాదని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ ఆలయంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించిన సమయంలో ప్రధాని మోదీ ఈ విధంగా మాట్లాడారు.

‘సోమ్‌నాథ్‌ ఆలయం ఎన్నోసార్లు విధ్వంసానికి గురయ్యింది. విగ్రహాలను కూడా చాలా సార్లు అపవిత్రం చేశారు. ఆలయ ఉనికిని నాశనం చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఇలా దాడులు జరిగిన ప్రతిసారీ సోమ్‌నాథ్‌ ఆలయం మరింత వైభవాన్ని సాధించింది. ఇది ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తోంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గతంలో సోమ్‌నాథ్‌ ఆలయం ధ్వంసం చేసిన విషయం వాస్తవమని.. ప్రస్తుతం కూడా ఇదే విధంగా జరుగుతుండడం కూడా నిజమని అన్నారు. ఇక 2013లో ప్రపంచ పర్యాటకంలో 65 స్థానంలో ఉన్న భారత్‌.. 2019 నాటికి 34వ స్థానానికి చేరుకున్న విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. అయితే, ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు మళ్లీ అరాచకం మొదలు పెట్టారని వస్తోన్న వార్తల నేపథ్యంలో విధ్వంసక శక్తులపై ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలాఉంటే, అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మళ్లీ అరాచకం మొదలు పెట్టినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తమకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తోన్న వారిపై కాల్పులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మహిళలు స్వేచ్ఛగా బయటకు వచ్చి.. వారి విధులు నిర్వర్తించకుండా అడ్డుపడుతున్నారనే నివేదికలు వస్తున్నాయి. ఇలా అఫ్గాన్‌ ప్రజలపై తాలిబన్ల అరాచకాలు మళ్లీ మొదలైనట్లు వస్తోన్న వార్తలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ అఫ్గాన్‌లో ఆకలి కేకలు తప్పవని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కనీసం కోటి మందికిపైగా ఆకలి బాధను ఎదుర్కొంటారని అంచనావేసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని