Delta Plus variant: ముంబయిలో మొదటి డెల్టా ప్లస్ మరణం

తాజా వార్తలు

Updated : 13/08/2021 15:25 IST

Delta Plus variant: ముంబయిలో మొదటి డెల్టా ప్లస్ మరణం

ముంబయి: దేశంలో కరోనా వేరియంట్లు ఉనికి చాటుతూనే ఉన్నాయి. తాజాగా ముంబయిలో తొలి డెల్టా ప్లస్‌ మరణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ వృద్ధురాలు(63) జులై 27న ఈ వేరియంట్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్యాధికారులు వెల్లడించారు.

ముంబయికి చెందిన ఆమెకి జులై 21నే కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటికే ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో చికిత్స తీసుకుంటున్న క్రమంలో జులై 27న ఆమె చనిపోయారు. అయితే ఆమె టీకా రెండు డోసులు వేయించుకున్నారు. అంతేగాకుండా ఆమె ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేసిన దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. ఇటీవల అందిన నివేదికల్లో మృతురాలితో సహా మరో ఇద్దరు కుటుంబ సభ్యుల్లో డెల్టా ప్లస్ వేరియంట్ వెలుగుచూసింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆ కుటుంబంలోని మిగతా సభ్యుల వివరాలు తెలియాల్సి ఉందని బీఎంసీ అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. తాజాగా నమోదైన మరణంతో కలిపి మహారాష్ట్రలో ఇప్పటివరకు మూడు డెల్టా ప్లస్ వేరియంట్ మరణాలు సంభవించాయి. రత్నగిరికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు  కొద్ది రోజుల క్రితం చనిపోయారు. ఆమె కూడా పలు అనారోగ్య సమస్యలతో బాధపడిందని అప్పట్లో అధికారులు తెలిపారు. ఇక రాయ్‌గఢ్‌లోనూ మరో మరణం చోటుచేసుకుంది. డెల్టాప్లస్ వేరియంట్‌ను కేంద్రం ఇప్పటికే ఆందోళనకర రకంగా గుర్తించిన సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని