Parliament: 18న అఖిలపక్ష భేటీ!

తాజా వార్తలు

Published : 14/07/2021 16:50 IST

Parliament: 18న అఖిలపక్ష భేటీ!

దిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సమావేశాలకు ముందురోజు (ఆదివారం) ఈ భేటీ జరగనుంది. ఇందుకోసం పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్‌ సమావేశాలు జరిగే ముందు అన్ని రాజకీయ పార్టీలతో ఇటువంటి భేటీ జరగడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎలాంటి ఆటంకాలూ లేకుండా సభలు సజావుగా జరిగేలా చూడాలని అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరనుంది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. ఇందుకోసం ఎంపీలందరూ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులకు సూచించారు. ఇప్పటివరకూ 323 మంది ఎంపీలు వ్యాక్సిన్‌ను పూర్తిస్థాయిలో తీసుకోగా ఇతర ఆరోగ్య కారణాల వల్ల మరో 23 మంది వ్యాక్సిన్‌ తీసుకోలేదని చెప్పారు. రెండు సభలు ఏకకాలంలోనే ఉదయం 11గంటలకు ప్రారంభమవుతాయని స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని