Ujjain Mahakaleshwar Temple: వీఐపీల రాక.. ఉజ్జయిని ఆలయంలో తొక్కిసలాట

తాజా వార్తలు

Updated : 27/07/2021 13:57 IST

Ujjain Mahakaleshwar Temple: వీఐపీల రాక.. ఉజ్జయిని ఆలయంలో తొక్కిసలాట

భోపాల్‌: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయంలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తుల రద్దీకి తోడు వీఐపీలు దర్శనానికి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 

సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌, మాజీ సీఎం ఉమాభారతి కూడా దర్శనానికి వచ్చారు. దీంతో భక్తులను నియంత్రించడం కష్టంగా మారింది. నాలుగో నంబరు గేటు వద్దకు భారీగా చేరుకున్న భక్తులు కొవిడ్‌ నిబంధనలను గాలికొదిలేసి.. ఒక్కసారిగా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నా వినకుండా బారికేడ్లను ధ్వంసం చేసి ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి వచ్చారు. కొందరు భక్తులైతే పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి పలువురు గాయపడినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

కరోనా దృష్ట్యా ఉజ్జయిని ఆలయంలో కొంతకాలం పాటు దర్శనాలు నిలిపివేశారు. గత నెలలోనే ఆలయాన్ని తెరిచారు. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతి రెండు గంటలకు 500 మంది చొప్పున మొత్తం రోజుకు 3500 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే, కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నవారు లేదా 48 గంటల ముందు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకుని నెగెటివ్‌ వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని ఆలయ అధికారులు ముందే ప్రకటించారు. కానీ, నిన్న సోమవారం కావడంతో ప్రీ బుకింగ్‌ చేసుకున్నవారితో పాటు భారీసంఖ్యలో భక్తులు ఉదయాన్నే ఆలయం వద్ద బారులు తీరానని, దీంతో పరిస్థితి అదుపు తప్పిందని అధికారులు వెల్లడించారు. 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని