India Corona : 31 వేల కేసులు..  38 వేల రికవరీలు

తాజా వార్తలు

Updated : 22/08/2021 11:43 IST

India Corona : 31 వేల కేసులు..  38 వేల రికవరీలు

1.09 శాతానికి పడిపోయిన క్రియాశీల రేటు

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే నిన్న కేసుల్లో తగ్గుదల కనిపించగా.. మరణాలు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,948 కేసులు వెలుగులోకి రాగా.. మరణాలు మళ్లీ 400కి చేరాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* గడిచిన 24 గంటల్లో  15,85,681 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

* నిన్న 403 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,34,367కి చేరింది.

* నిన్న 38,487 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,16,36,469కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.57 శాతంగా ఉంది.

* ఇక క్రియాశీల కేసుల సంఖ్య 3,53,398గా ఉండి.. ఆరేటు 1.09 శాతానికి పడిపోయింది.

* దేశంలో వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న 52,23,612 మందికి టీకాలు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 58,14,89,377కి చేరింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని