Corona : 200 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

తాజా వార్తలు

Updated : 04/10/2021 12:56 IST

Corona : 200 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

దిల్లీ : దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా 20వేలకుపైనే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే అంతక్రితం రోజు(22,842)తో పోల్చితే తాజా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఇక మరణాలు 200లోపే చోటుచేసుకోవడం ఊరట కలిగిస్తోంది.

* గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,799 కేసులు నమోదయ్యాయి.

* నిన్న 180 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,48,997కి చేరింది.

* ఇక కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కవగా నమోదవుతుండటం సానుకూలాంశం. నిన్న ఒక్క రోజే 26,718 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 3.31 కోట్లకు చేరింది.

* రీకవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 200 రోజుల కనిష్ఠానికి చేరి 2,64,458(0.78%)గా ఉంది.

ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 90.79 కోట్ల డోసులను కేంద్రం పంపిణీ చేసింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని