Corona: 40శాతంమేర పెరిగిన కొత్త కేసులు

తాజా వార్తలు

Published : 21/07/2021 10:00 IST

Corona: 40శాతంమేర పెరిగిన కొత్త కేసులు

మృతుల సంఖ్య ఎంతంటే..?

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా కొత్త కేసులు పెరగ్గా.. మరణాలు భారీ సంఖ్యలో రికార్డయ్యాయి. నిన్న 18,52,140 మందిని పరీక్షించగా.. 42,015 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందురోజు 30 వేలకు తగ్గిన కేసులు.. తాజాగా 40 శాతం మేరకు పెరిగాయి. నిన్న మరణాలు మాత్రం 3,998గా నమోదయ్యాయి. మహారాష్ట్ర మరణాల లెక్కను సవరించడంతో ఈ స్థాయిలో తేడా కనిపించింది. ఆ రాష్ట్రం వెల్లడించిన మృతుల సంఖ్య 3,656గా ఉంది. దాంతో మొత్తం కేసులు 3.12కోట్లకు చేరగా.. 4.18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

ప్రస్తుతం 4,07,170 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. 36,977 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే, నిన్న రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం క్రియాశీల రేటు 1.30 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది. మొత్తంగా 3.03కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇక నిన్న 34,25,446 మంది టీకా వేయించుకోగా.. ఇప్పటి వరకు 41,54,72,455 డోసులు పంపిణీ అయ్యాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని