Corona: మరోసారి స్వల్పంగా తగ్గిన కేసులు, మరణాలు

తాజా వార్తలు

Updated : 14/08/2021 10:51 IST

Corona: మరోసారి స్వల్పంగా తగ్గిన కేసులు, మరణాలు

53 కోట్ల మార్కు దాటిన టీకా పంపిణీ 

దిల్లీ: దేశంలో మరోసారి కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా క్షీణించాయి. తాజాగా 22,29,798 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,667 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 3.6 శాతం తగ్గుదల కనిపించింది. నిన్న మరో 478 మంది మరణించారు. దాంతో మొత్తం కేసులు 3.21 కోట్లకు చేరగా.. మరణాలు 4.30లక్షల మార్కును దాటాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. 

ఇక నిన్న 35 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం. క్రియాశీల కేసులు 3,87,673గా ఉండగా.. ఆ రేటు 1.21 శాతానికి చేరింది. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య.. 3,13,38,088(97.45 శాతం). మరోపక్క నిన్న 63,80,937 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 53కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని