India Corona: 400 దిగువకు కరోనా మరణాలు

తాజా వార్తలు

Updated : 21/08/2021 12:20 IST

India Corona: 400 దిగువకు కరోనా మరణాలు

తగ్గిన కొత్త కేసులు 

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులో ఉంది. ముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేసులు 5.7 శాతం మేర తగ్గగా.. మృతుల సంఖ్య 400 దిగువకు చేరిందని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజాగా 17,21,205 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 34,457 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. 24 గంటల వ్యవధిలో 375 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాలు మార్చి 30 నాటి స్థాయికి క్షీణించాయి. ఇక మొత్తం కేసులు 3.23 కోట్ల మార్కును దాటగా.. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4.33లక్షలకు చేరింది. నిన్న 36 వేల మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.15 కోట్లు(97.54 శాతం)గా ఉంది. క్రియాశీల కేసులు 3,61,340గా ఉండగా.. ఆ రేటు 1.12 శాతానికి తగ్గింది. మరోపక్క నిన్న 36.36లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 57,61,17,350గా ఉంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని