India Corona: నివురుగప్పిన నిప్పులా కరోనా.. మళ్లీ పెరిగిన కేసులు

తాజా వార్తలు

Updated : 28/08/2021 15:09 IST

India Corona: నివురుగప్పిన నిప్పులా కరోనా.. మళ్లీ పెరిగిన కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ నివురుగప్పిన నిప్పులా ఉంది. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో క్రియాశీల కేసులు పెరుగుతుండటం, రికవరీ రేటు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మూడోముప్పు ఆందోళనల మధ్య టీకా కార్యక్రమంలో వేగం పుంజుకోవడం మాత్రం ఊరటనిచ్చే విషయం. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను విడుదల చేసింది.

తాజాగా 17,61,110 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 46,759 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 4.7 శాతం మేర పెరుగుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో 509 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 3.26 కోట్ల మందికి వైరస్ సోకగా.. 4,37,370 మందికి మృత్యుఒడికి చేరుకున్నారు. మరోవైపు ఒక్క కేరళలోనే 32,801 కేసులు వెలుగుచూడడం గమనార్హం.

కొద్దిరోజులుగా క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 3,59,775 (1.10 శాతం) మంది వైరస్‌తో బాధపడుతున్నారు. నిన్న 31,374 మంది కోలుకున్నారు. ఈ రోజు కూడా కొత్త కేసుల కంటే రికవరీలే తక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు 3.18 కోట్ల మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 97.56 శాతంగా ఉంది.

ఇదిలా ఉండగా.. జనవరిలో భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా టీకా కార్యక్రమంలో నిన్న రికార్డు నమోదైంది. ఒక్కరోజే 1,03,35,290 మంది టీకా వేయించుకున్నారు. దాంతో మొత్తంగా పంపిణీ అయిన డోసులు సంఖ్య 62,29,89,134కి చేరింది. ఈ ఫీట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను ప్రశంసించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని