India Corona: మళ్లీ పెరిగిన కేసులు.. ఆ రాష్ట్రానిదే మెజార్టీ వాటా

తాజా వార్తలు

Updated : 18/09/2021 10:45 IST

India Corona: మళ్లీ పెరిగిన కేసులు.. ఆ రాష్ట్రానిదే మెజార్టీ వాటా

నిన్న జెట్‌ స్పీడ్‌తో సాగిన వ్యాక్సినేషన్

దిల్లీ: ఈ వారం మొదట్లో తగ్గినట్టే కనిపించిన కరోనా కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే తాజాగా 3.6 శాతం మేర పెరిగి కేసులు 35 వేలకు చేరాయని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. సగానికిపైగా కేసులు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న 23 వేలకుపైగా కేసులు వెలుగుచూడగా.. 131 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక మహారాష్ట్రలో 3,586 మంది వైరస్‌ బారినపడ్డారు.

24 గంటల వ్యవధిలో 35,662 మందికి కరోనా సోకింది. 281 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.34 కోట్లకు చేరగా.. 3.26 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న ఒక్కరోజే 33వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3.4 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. గత ఏడాది జనవరి నుంచి మహమ్మారి కారణంగా 4,44,529 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 1.02 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.65 శాతానికి చేరింది. నిన్న 14.48 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

టీకా రికార్డు.. 79 కోట్ల మార్కు దాటిన డోసుల పంపిణీ..

నిన్న ప్రధాని మోదీ పుట్టిన రోజు వేళ.. కరోనా టీకా కార్యక్రమం జెట్ స్పీడ్‌తో ముందుకెళ్లింది. ఒక్కరోజే 2.5 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. దాంతో మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 79.42 కోట్లకు చేరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని