India corona: కొత్త కేసులు, రికవరీలు.. 31 వేలే

తాజా వార్తలు

Updated : 23/09/2021 11:15 IST

India corona: కొత్త కేసులు, రికవరీలు.. 31 వేలే

ఆందోళనకలిగిస్తోన్న కేరళ ఉద్ధృతి 

దిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ 30 వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 15,27,443 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,923 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు 18 శాతం మేర పెరిగాయి. ఒక్క కేరళలోనే 19,675 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో 3 వేల మందికి వైరస్ సోకింది. నిన్న మరో 282 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య గణాంకాలను వెల్లడించింది. 

దేశంలో ఇప్పటివరకు 3.35 కోట్ల మందికి కరోనా సోకగా... 3.28 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న 31 వేలమంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 3,01,640 మంది వైరస్‌ కారణంగా చికిత్స పొందుతున్నారు. ఇక 4,46,050 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. క్రియాశీల కేసులు రేటు 0.90 శాతం, రికవరీ రేటు 97.77 శాతం ఉన్నాయి. 

83 కోట్ల టీకా డోసులు పంపిణీ.. దేశంలో కరోనా టీకా కార్యక్రమం ఆశాజనకంగా ఉంది. నిన్న 71.38 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. మొత్తంగా 83.39 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.  



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని