India Corona: 3 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు..

తాజా వార్తలు

Published : 24/09/2021 09:50 IST

India Corona: 3 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు..

మెరుగ్గా రికవరీ రేటు.. 84 కోట్ల టీకా డోసుల పంపిణీ

దిల్లీ: దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు, మరణాల్లో  హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,382 మందికి కరోనా సోకింది. ముందురోజు కంటే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. మరో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరగా..ఇప్పటివరకు 4.46లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.

నిన్న ఒక్కరోజే 32,542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.28 కోట్లకు చేరాయి. క్రియాశీల కేసులు మూడు లక్షలకు తగ్గాయి. ఆ రేటు 0.89 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 97.78 శాతానికి పెరిగింది. ఈ గణాంకాలు ప్రస్తుతం సానుకూలంగా కనిపిస్తున్నాయి.

84 కోట్ల టీకా డోసుల పంపిణీ.. దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. నిన్న 72.2 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 84.15 కోట్ల మార్కును దాటింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని