India Corona: కోలుకున్న వారి కంటే కొత్త కేసులే ఎక్కువ..!

తాజా వార్తలు

Updated : 25/09/2021 12:39 IST

India Corona: కోలుకున్న వారి కంటే కొత్త కేసులే ఎక్కువ..!

కొత్తగా 29 వేల కేసులు.. 290 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులో ఉంది. తాజాగా కొత్త కేసులు మరోసారి 30 వేల దిగువన నమోదయ్యాయి. మరణాలు 300 దిగువకు చేరాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది. 

24 గంటల వ్యవధిలో 15,92,421 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 29,616 (కేరళలో 17,983)మందికి పాజిటివ్‌గా తేలింది. ముందు రోజుతో పోల్చితే కేసులు 5 శాతం మేర తగ్గాయి. నిన్న 28 వేల మంది కోలుకున్నారు. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉన్నాయి. నిన్న మరో 290 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం కేసులు 3.36 కోట్లకు చేరగా.. రికవరీలు 3.28 కోట్లు(97.78 శాతం)గా ఉన్నాయి. ప్రస్తుతం మూడు లక్షల మందికిపైగా కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.90 శాతానికి చేరింది. ఇప్పటివరకు కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 4.46 లక్షలుగా ఉంది. నిన్న 71 లక్షల మందికి టీకా అందింది. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 84.89 కోట్లకు చేరింది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని