కొవిడ్ వేళ.. భారతీయులు పెద్ద మనసు చాటుకున్నారు..

తాజా వార్తలు

Published : 25/09/2021 01:19 IST

కొవిడ్ వేళ.. భారతీయులు పెద్ద మనసు చాటుకున్నారు..

వరల్డ్ గివింగ్ ఇండెక్స్-2021లో భారత్‌కు 14వ స్థానం

(ప్రతీకాత్మక చిత్రం)

దిల్లీ: 2020..ఈ ఏడాది కొవిడ్ మహమ్మారి భారత్‌ను తాకింది. సాఫీగా సాగుతున్న జీవితాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది. దాంతో చాలామందికి ఆహారం, వైద్యం వంటి అత్యవసరాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ సమయంలో భారతీయులు తమ మంచి మనసును బయటపెట్టుకున్నారు. గతేడాది 61 శాతం మంది తమకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులకు సహాయం చేశారు. 36 శాతం మంది డబ్బు ఇచ్చి ఆదుకున్నారు. 34 శాతం మంది అవసరంలో ఉన్నవారికి స్వచ్ఛందంగా సేవ చేశారు. దాంతో పదేళ్ల క్రితం వరల్డ్ గివింగ్ ఇండెక్స్‌లో 82వ స్థానంలో ఉన్న భారత్ 2021 ఏడాదికి ఒక్కసారిగా 14వ స్థానానికి ఎగబాకింది. టాప్‌ 20 దేశాల జాబితాలో నిలిచిందని ఛారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్( సీఏఎఫ్) వెల్లడించింది.

గతేడాది కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక కమ్యూనిటీలు తోటివారికి సహకరించాయి. 2009 తర్వాత ఆ ఏడాదే అత్యధికంగా ‘అపరిచితులు’ సహాయం పొందారని సీఏఎఫ్ వెల్లడించింది. ప్రపంచం మొత్తంలో 55 శాతం అంటే 300 కోట్ల మంది వయోజనులు 2020లో తమకు తెలియని వ్యక్తులకు సహకరించారని ఈ సర్వే తెలిపింది. గత ఐదు సంవత్సరాలతో పోల్చితే గత ఏడాదిలో ఎక్కువమంది డబ్బు విరాళం ఇచ్చారని చెప్పింది.

ఇదిలా ఉండగా... సంపన్న దేశాలైన యూఎస్‌ఏ, కెనడా, ఐర్లాండ్‌, యూకే, నెదర్లాండ్స్‌ మొదటి పది స్థానాల నుంచి కిందికి పడిపోయాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మాత్రమే 10 లోపు స్థానాలను నిలబెట్టుకున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. పేద దేశాలైన కెన్యా, నైజీరియా, ఘనా టాప్‌ టెన్‌లో చోటుదక్కించుకున్నాయి.

మొత్తం మీద అందరికంటే పెద్ద మనసు చాటుకున్న దేశం ఇండొనేసియా. ఈ ర్యాకింగ్స్‌లో అది మొదటి స్థానంలో నిలిచింది. కెన్యా, నైజీరియా, మయన్మార్, ఆస్ట్రేలియా, ఘనా, న్యూజిలాండ్, ఉగాండా, కొసోవో, థాయ్‌లాండ్ వరుసగా మొదటి పది స్థానాల్ని ఆక్రమించాయి. భారత్‌ది 14వ స్థానం. పది సంవత్సరాలకు ఒకసారి సీఏఎఫ్ ఈ సర్వే చేపడుతుంది. దాని ప్రకారం 2019లో అమెరికా మొదటి స్థానంలో ఉంది.  114 దేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ర్యాకింగ్స్‌ వెలువడ్డాయి. ఆ దేశాలు 90 శాతం మంది వయోజనులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అలాగే అమెరికాకు చెందిన గాలప్ సంస్థ నుంచి ఈ సమచారాన్ని సేకరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని