India Corona: హమ్మయ్య.. 1శాతం దిగువకు క్రియాశీల రేటు

తాజా వార్తలు

Updated : 24/08/2021 10:53 IST

India Corona: హమ్మయ్య.. 1శాతం దిగువకు క్రియాశీల రేటు

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి అదుపులోకి వచ్చినట్లే కన్పిస్తోంది. క్రియాశీల రేటు తగ్గడం.. రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది. యాక్టివ్‌ కేసుల రేటు 1శాతం దిగువకు పడిపోయింది. 2020 మార్చి తర్వాత క్రియాశీల రేటు ఈ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి. అటు కొత్త కేసులు కూడా భారీగా తగ్గుముఖం పట్టడం ఆశాజనకంగా ఉంది. కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య దాదాపు 50శాతం ఎక్కువగా ఉంది.

* దేశంలో కొత్తగా 25,467 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.24కోట్లకు చేరింది. ఇదే సమయంలో మరో 39,486 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.17కోట్ల మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 97.68శాతానికి పెరిగింది.

* కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో యాక్టివ్‌ కేసులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,19,551 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.98శాతంగా ఉంది.

* గడిచిన 24 గంటల్లో మరో 354 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో 4,35,110 మందిని కరోనా బలితీసుకుంది.

* ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. సోమవారం 63,85,298మంది టీకాలు వేశారు. ఇప్పటివరకు 58.89కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని