Afghanistan: ఆ భారతీయులంతా సురక్షితమే..!

తాజా వార్తలు

Updated : 21/08/2021 15:51 IST

Afghanistan: ఆ భారతీయులంతా సురక్షితమే..!

వెల్లడించిన ప్రభుత్వ వర్గాలు

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ నుంచి భారత్‌ వచ్చేందుకు కాబుల్ విమానాశ్రయం వచ్చిన భారతీయుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేశారనే వార్తలు ఒక్కసారిగా తీవ్ర ఆందోళన కలిగించాయి. అయితే వారిని ప్రశ్నించి, విడుదల చేసినట్లు తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

కాబుల్ విమానాశ్రయం సమీపంలో ఉన్న 150 మంది ప్రయాణికుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు ఈ రోజు ఉదయం స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఆ వెంటనే భారత విదేశాంగ శాఖ అప్రమత్తమై.. సంప్రదింపులు చేపట్టింది. కాగా ప్రయాణికుల వద్ద ఉన్న పత్రాలు పరిశీలించేందుకే వారిని తీసుకెళ్లినట్లు తెలిసింది. తనిఖీల అనంతరం వారిని విడుదల చేశారని, త్వరలో వారిని భారత్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఈ కిడ్నాప్ వార్తలు అవాస్తవమని ప్రభుత్వ వర్గాలు మీడియాకు చెప్పాయి. తాలిబన్ ప్రతినిధి కూడా ఈ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.  



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని