India Vaccination : 80 కోట్ల మార్కును దాటిన టీకా డోసుల సంఖ్య

తాజా వార్తలు

Updated : 19/09/2021 10:15 IST

India Vaccination : 80 కోట్ల మార్కును దాటిన టీకా డోసుల సంఖ్య

1 శాతం దిగువకు క్రియాశీల రేటు

దిల్లీ : దేశంలో కరోనా కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే తాజా కేసుల సంఖ్య కాస్త తగ్గి 30 వేలకు చేరింది. మరోవైపు మరణాలు 300కి పైగా నమోదయ్యాయి. ఇక కొవిడ్‌ టీకా కార్యక్రమం దేశవ్యాప్తంగా జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 80 కోట్ల మైలురాయిని దాటింది.

* గడిచిన 24 గంటల్లో 15,59,895 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 30,773 కేసులు వెలుగులోకి వచ్చాయి.

* నిన్న 309 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,44,838కి చేరింది.

* నిన్న 38,945 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 3,26,71,167(97.68 శాతం)కి చేరింది.

* దేశంలో క్రియాశీల కేసులు మరోసారి 1 శాతం దిగువకు చేరాయి. ప్రస్తుతం 3,32,158(0.99 శాతం) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* ఇక నిన్న ఒక్క రోజే 85,42,732 మందికి టీకాలు ఇచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 80,43,72,331కి చేరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని