JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్‌ మార్కులు ఇవే..!

తాజా వార్తలు

Published : 15/09/2021 20:16 IST

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్‌ మార్కులు ఇవే..!

విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ

దిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు ఎదురుచూస్తోన్న జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. వీటికి సంబంధించి తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు షెడ్యూల్‌, కటాఫ్‌ మార్కులను జాతీయ పరీక్షల మండలి (NTA) విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 20వ తేదీ సాయంత్రం వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తునకు అవకాశం ఉంటుందని తెలిపింది. అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫీజు మాత్రం 21వ తేదీలోపు చెల్లించవచ్చని పేర్కొంది. అక్టోబర్‌ 3న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుంది. అయితే, ఇందుకు దరఖాస్తు చేసుకునే వివిధ కేటగిరీ వారికి కటాఫ్‌ మార్కులను (శాతాల్లో) ఎన్‌టీఏ విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కేటగిరీ                    కటాఫ్‌ శాతం

ఓపెన్‌ కేటగిరీ (UR)       87.89 శాతం

ఓబీసీ (OBC)             68.02శాతం

ఈడబ్ల్యూఎస్‌ (EWS)      66.22శాతం

ఎస్సీ (SC)               46.88శాతం

ఎస్టీ (ST)                34.67శాతం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని