Lakhimpur Kheri Violence: లఖింపుర్‌ ఖేరీ ఘటనలో జర్నలిస్టు మృతి

తాజా వార్తలు

Updated : 04/10/2021 12:44 IST

Lakhimpur Kheri Violence: లఖింపుర్‌ ఖేరీ ఘటనలో జర్నలిస్టు మృతి

లఖ్‌నవూ : ఉత్తర్‌ప్రదేశ్‌లో లఖింపుర్‌ ఖేరీలో ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం రైతులు చేపట్టిన ఆందోళన పెద్ద ఎత్తున హింసకు దారితీసింది. లఖింపుర్‌ ఖేరీలో ఆదివారం రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ కారుతోపాటు మరో వాహనం దూసుకెళ్లింది. ఈ  ఘటనలో నలుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం చెలరేగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భగ్గుమన్న రైతు సంఘాల నేతలు నేడు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. 

మరోవైపు ఈ ఘటనపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆశిష్‌ మిశ్రాపై స్థానిక పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. ఇరుపక్షాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అదనపు డీజీ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని