Paytm CEO: ఆయన మాట్లాడిన సమయానికి.. దిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్లి రావొచ్చట..!

తాజా వార్తలు

Published : 15/09/2021 01:53 IST

Paytm CEO: ఆయన మాట్లాడిన సమయానికి.. దిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్లి రావొచ్చట..!

ముంబయి: వేల సంఖ్యలో ఉద్యోగులకు మార్గనిర్దేశం చేసుకుంటూ.. వ్యాపారాన్ని పరుగులు పెట్టించే కొత్త ఆలోచనలతో తలమునకలై ఉంటారు సంస్థల అధినేతలు. ఒక్కోసారి పనిలో మునిగిపోతే సమయం తెలీకుండా పనిచేస్తుంటారు. పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇటీవల ఆయన ఒకరోజు పనిగంటలు మొత్తాన్ని జూమ్ వేదికగా చర్చించడానికే వినియోగించారు. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఆయన చెప్పిన సమయానికి  దిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లి, తిరిగి రావొచ్చట. 

‘ఇప్పుడే జూమ్ కాల్‌ను ముగించాను. నాకు తెలిసి ఇదే సుదీర్ఘమైన జూమ్ కాల్ అనుకుంటా. అందుకోసం వెచ్చించిన సమయం ఏడు గంటల 45 నిమిషాలు’ అంటూ విజయ్‌ శేఖర్ శర్మ చేసిన  ట్వీట్ నెటిజన్లను ఆశ్చర్యపర్చింది. దీనిపై నెట్టింట కామెంట్ల వర్షం కురిసింది. ‘ఇది జూమ్ కాల్ కాదు.. జూమ్ మారథాన్‌’, ‘త్వరలో పేటీఎం ఐపీఓకు వెళ్లనుందా..?’, ‘మీరు నా రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. నా కాల్‌ సమయం 10 గంటలు’ అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. మరికొందరు ఇన్నిగంటలా అని పెదవి విరిచారు. ఇదిలా ఉండగా.. డిజిటల్ పేమెంట్స్‌కు చెందిన ఈ సంస్థ త్వరలో ఐపీఓకు వెళ్లనున్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని