బాలా సాహేబ్ బతికుంటే.. ఇలా జరిగేది కాదు..!

తాజా వార్తలు

Published : 28/10/2021 15:10 IST

బాలా సాహేబ్ బతికుంటే.. ఇలా జరిగేది కాదు..!

మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసిన వాంఖడే భార్య

ముంబయి: డ్రగ్స్‌ కేసులో ఆర్యన్ ఖాన్‌ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే చుట్టూ పలు ఆరోపణలు చుట్టుముట్టాయి. దీంతో ఆయనపై ఎన్‌సీబీ విచారణ కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య క్రాంతి రేడ్కర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. 

‘మాకు ప్రజల ముందు నిత్యం అవమానాలు ఎదురవుతున్నాయి. ఛత్రపతి శివాజీ రాష్ట్రంలో ఓ మహిళను అగౌరవపరుస్తున్నారు. బాలాసాహేబ్ ఉండి ఉంటే.. ఈ వైఖరి ఆయనకు నచ్చేది కాదు. ఆయన లేరు కానీ, మీరు ఉన్నారు. ఆయనలో మిమ్మల్ని చూసుకుంటున్నాం. మిమ్మల్ని నమ్ముతున్నాం. నాకు, నా కుటుంబానికి అన్యాయం జరగడాన్ని మీరు ఒప్పుకోరని నేను నమ్ముతున్నాను. ఒక మరాఠీ వ్యక్తిగా న్యాయం కోసం మీవైపు చూస్తున్నాను. మాకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థిస్తున్నాను’ అని క్రాంతి ఆ లేఖలో కోరారు. ఆయన్ను కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరామని, ఆయనిచ్చే సమాధానం కోసం చూస్తున్నామని తెలిపారు. మరోపక్క వాంఖడే సోదరి జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాశారు. ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదురవుతున్నాయని అందులో వెల్లడించారు. 

ముంబయిలోని క్రూజ్ డ్రగ్స్‌ కేసులో నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. అతడితో పాటు పలువురి అరెస్టులు వాంఖడే నేతృత్వంలో జరిగాయి. అప్పటి నుంచి ఆయనపై పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎన్‌సీబీ విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. ఆర్యన్‌కు ఇంతవరకు బెయిల్ దొరకలేదు. బాంబే హైకోర్టు ఈ కేసులో వాదనలు వింటోంది. అవి ఈ రోజు కూడా కొనసాగనున్నాయి. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని