Lakhimpur Kheri Violence: మృతుల కుటుంబాలకు రూ.45 లక్షల పరిహారం

తాజా వార్తలు

Updated : 04/10/2021 21:55 IST

Lakhimpur Kheri Violence: మృతుల కుటుంబాలకు రూ.45 లక్షల పరిహారం

లఖ్‌నవూ : లఖింపుర్‌ ఖేరీ ఘటనలో మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం  ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై హైకోర్టు విశ్రాంత జడ్జితో విచారణకు ఆదేశించింది.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం రైతులు చేపట్టిన ఆందోళన పెద్ద ఎత్తున హింసకు దారితీసింది. రహదారిపై నిరసన వ్యక్తంచేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన అన్నదాతలు దాడి చేయడంతో ఓ కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ జర్నలిస్టు ఈ ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని