Corona: ఈ సారి ‘పండుగ’ వాతావరణం లేనట్లే..!

తాజా వార్తలు

Published : 23/08/2021 23:26 IST

Corona: ఈ సారి ‘పండుగ’ వాతావరణం లేనట్లే..!

ముంబయి: కరోనా కారణంగా ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పండుగలు వెలవెలబోతున్నాయి. గతేడాది మాదిరిగానే ఈ సారి ఆంక్షల మధ్యే, పరిమిత సంఖ్యలో పర్వదినాలను జరుపుకోవాలని ప్రభుత్వాలు, నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఈ కృష్ణాష్టమికి మహారాష్ట్ర దహీ హండీ వేడుకను నిర్వహిచడం లేదు. ఈ మేరకు జరిగిన సమావేశంలో మానవతా దృక్పథంతో ఉత్సవాలను మరికొంతకాలం పక్కనపెట్టాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నిర్వాహకులను కోరారు. 

అలాగే ఈసారి గణేశ్ చతుర్థిపై ఆంక్షల ప్రభావం పడింది. ఇప్పటికే మహా ప్రభుత్వం వినాయకుడి విగ్రహం ఎత్తు తగ్గించడంతో సహా పలు మార్గదర్శకాలను జారీచేసింది. అలాగే ఊరేగింపులకు ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదు. సెప్టెంబర్ 10న దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి జరపుకోనున్న సంగతి తెలిసిందే.

పండుగలు జరుపుకొనే విషయంలో భారత్‌ సహనంతో ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా ఇప్పటికే హెచ్చరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు అదుపులో ఉందని, మతపరమైన కారణాలతో ఆంక్షలను ఎత్తివేయొద్దని సూచించారు. ఒకేచోట పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడితే ఆరోగ్య సేవలపై భారం పడుతుందన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని