Modi US Visit: కమలా హారిస్, టిమ్‌ కుక్‌తో భేటీ కానున్న మోదీ!

తాజా వార్తలు

Updated : 20/09/2021 16:49 IST

Modi US Visit: కమలా హారిస్, టిమ్‌ కుక్‌తో భేటీ కానున్న మోదీ!

ఈ నెలలో 3 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న మోదీ

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యంలో జరగనున్న క్వాడ్ నేతల సదస్సులో పాల్గొననున్నారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్‌, ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం.

మోదీ సెప్టెంబర్ 22న అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాతి రోజు అక్కడి పలు ప్రముఖ సంస్థలకు చెందిన సీఈఓలతో సమావేశం కానున్నారు. వారిలో టిమ్ కుక్ కూడా ఉండనున్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే కమలా హారిస్‌తోనూ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్, జపనీస్ ప్రధాని యోషియిడే సుగాతో సమావేశం కానున్నారు.

ఇదిలా ఉండగా.. మోదీ, బైడెన్‌ మధ్య అఫ్గానిస్థాన్ పరిణామాలు, కొవిడ్-19, వాతావరణ మార్పులు, ఇండో-పసిఫిక్‌, ఉగ్రవాదం వంటి పలు అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. అలాగే పర్యటనలో చివరి రోజున యూఎన్ జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగించనున్నారు. మార్చిలో బంగ్లాదేశ్ పర్యటన తర్వాత ఈ ఆరు నెలల వ్యవధిలో ప్రధాని వెళ్తోన్న తొలి అంతర్జాతీయ పర్యటన ఇది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని