Covid Vaccine: బూస్టర్ డోసు కోసం పరిగెత్తొద్దు..!

తాజా వార్తలు

Updated : 19/08/2021 15:40 IST

Covid Vaccine: బూస్టర్ డోసు కోసం పరిగెత్తొద్దు..!

డెల్టాపై టీకాలు భేషుగ్గా పనిచేస్తున్నాయంటోన్న నిపుణులు

దిల్లీ: కొవిడ్-19 టీకాలు డెల్టా వేరియంట్‌పై భేషుగ్గా పనిచేస్తున్నాయని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గగన్‌దీప్ కాంగ్‌ అన్నారు. అలాగే బూస్టర్ డోసుల కోసం అనవసరమైన హడావుడి వద్దని చెప్పారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘బూస్టర్ డోసుతో కరోనా నుంచి పూర్తిస్థాయి రక్షణకు హామీ ఏమీ లేదు. అయితే, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో మాత్రం సహకరిస్తుంది. ఈ డోసు పొందడంపై అనవరమైన ఆందోళనకు గురికావొద్దు. బూస్టర్ డోసుల కోసం పరిగెత్తొద్దు’ అని గగన్‌దీప్‌ కాంగ్‌ అన్నారు.

ఇదిలా ఉండగా. .ఇప్పటికే కొన్ని దేశాలు బూస్టర్ డోసుకు ఆమోదం తెలిపాయి. కరోనా మూడోదశ వ్యాప్తి సహా బలహీన రోగనిరోధక శక్తిని దృష్టిలో ఉంచుకొని అగ్రరాజ్యం అమెరికా మూడో డోసు టీకాకు ఆమోదం తెలిపింది. అమెరికన్లు రెండు డోసుల తర్వాత మరో టీకా తీసుకునేందుకు అనుమతిస్తూ ఆ దేశ వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం( సీడీసీ) ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్ కూడా అదే బాటలో నడుస్తోంది. డెల్టా వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇజ్రాయెల్ ఇప్పటికే 10లక్షల మందికి బూస్టర్ డోసు ఇచ్చినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. టీకా పంపిణీ విషయంలో పేద, ధనిక దేశాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు బూస్టర్ డోసుపై తాత్కాలిక నిషేధం విధించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తిని ఈ దేశాలు పట్టించుకోలేదు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని