Parliament monsoon session: పార్లమెంట్‌లో కొనసాగిన నిరసనల హోరు

తాజా వార్తలు

Updated : 27/07/2021 16:46 IST

Parliament monsoon session: పార్లమెంట్‌లో కొనసాగిన నిరసనల హోరు

ఉభయ సభలు మళ్లీ వాయిదా 

దిల్లీ: ఫోన్లపై నిఘా, రైతుల ఉద్యమ సంబంధిత ప్రస్తావనలతో మంగళవారం కూడా పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల నిరసనల పర్వం కొనసాగింది. ఈ అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో గందరగోళం నెలకొని ఉభయ సభలు వాయిదా పడ్డాయి. 

ఈ ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. పెగాసస్‌, సాగు చట్టాలపై చర్చ జరపాలంటూ ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. విపక్షాల నినాదాల నడుమే స్పీకర్‌ ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు. ప్రతిపక్ష ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ సహా పలువురు మంత్రులు సమాధానమిచ్చారు. అయితే, ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన ఉద్ధృతం చేయడంతో స్పీకర్‌ వారిని వారించారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చలో పోటీ చూపించాలని, నిరసనల్లో కాదని సూచించారు. అయినప్పటికీ వారు శాంతించకపోవడంతో సభను 11.45 గంటల వరకు వాయిదా వేశారు. 

అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పెగాసస్‌పై చర్చ జరపాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని