Gurmeet Ram Rahim Singh: డేరా బాబాకు జీవిత ఖైదు

తాజా వార్తలు

Updated : 18/10/2021 22:00 IST

Gurmeet Ram Rahim Singh: డేరా బాబాకు జీవిత ఖైదు

మరో నలుగురికి కూడా..

అనుచరుడి హత్య కేసులో నేడు శిక్ష ఖరారు

చండీగఢ్‌: డేరా సచ్చా సౌదా నిర్వాహకుడు, వివాదాస్పద మతగురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు పడింది. 2002లో హత్యకు గురైన డేరా సౌదా మేనేజర్‌ రంజిత్ సింగ్ కేసులో ఈ బాబా పాత్ర ఉన్నట్లు హరియాణాలోని పంచకులలోని సీబీఐ న్యాయస్థానం ఇదివరకే పేర్కొంది. ఆయనతో పాటు మరో నలుగురికి ఈ హత్యకేసులో హస్తం ఉన్నట్లు తేల్చిన న్యాయస్థానం.. సోమవారం శిక్ష ఖరారు చేసింది. ఆ నలుగురికి కూడా జీవిత ఖైదు విధించింది. 

ఈ శిక్షలో భాగంగా కోర్టు దోషులకు జరిమానా విధించింది. డేరా బాబా రూ.31లక్షలు చెల్లించాల్సి ఉంది. మిగతా నలుగురు లక్షన్నర నుంచి 75 వేల రూపాయల వరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తంలో కొంత భాగం రంజిత్ కుటుంబానికి వెళ్లనుంది. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరో నిందితుడు ఇదివరకే ప్రాణాలు కోల్పోయాడు.

డేరా బాబాకు అనుచరుడిగా ఉన్న రంజిత్‌ సింగ్‌ 2002లో హత్యకు గురయ్యారు. డేరా ఆశ్రమంలో మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపులను పేర్కొంటూ విడుదలైన ఓ లేఖ అప్పట్లో కలకలం రేపింది. అయితే, అది ఆశ్రమ మేనేజర్‌గా ఉన్న రంజిత్‌ సింగ్‌ రాసినట్లు డేరా బాబా అనుమానించారు. దీంతో ఆయనను హత్య చేసేందుకు డేరా బాబా కుట్రపన్నినట్లు సీబీఐ ఛార్జిషీటు నమోదు చేసింది. ఆ హత్యకేసులో భాగస్తులైన వారిని ఇటీవల దోషులుగా తేల్చి, ఈ రోజు శిక్ష ఖరారు చేసింది. డేరా బాబా ఓ అత్యాచార కేసులో 2017 నుంచి శిక్ష అనుభవిస్తోన్న సంగతి తెలిసిందే. 
 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని