Medicine: షుగర్‌, కేన్సర్‌, టీబీ వ్యాధిగ్రస్థులకు తీపి కబురు!

తాజా వార్తలు

Published : 05/09/2021 06:56 IST

Medicine: షుగర్‌, కేన్సర్‌, టీబీ వ్యాధిగ్రస్థులకు తీపి కబురు!

వారు వినియోగించే 39 రకాల ఔషధాల ధరలు తగ్గే అవకాశం

ఈనాడు, దిల్లీ: ఔషధ ధరల భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ముఖ్యంగా కేన్సర్‌, టీబీ, షుగర్‌ వ్యాధుల చికిత్స, నివారణలకు ఉపయోగించే 39 రకాల మందులు, టీకాల ధరలు త్వరలో తగ్గనున్నాయి. ఇందుకుగాను జాతీయ అత్యవసర ఔషధాల జాబితా(ఎన్‌ఎల్‌ఇఎం)ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సవరించనుంది. ఈ జాబితాలో చేర్చిన మందులను ఎంత ధరకు విక్రయించాలన్నది జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) నిర్ణయిస్తుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఎన్‌ఎల్‌ఇఎంలో 39 ఔషధాలను చేర్చనున్న ప్రభుత్వం మరో 16 ఔషధాలను ఆ జాబితా నుంచి తొలగించాలని ప్రతిపాదించనుంది. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ నివారణకు వాడే ఎరిత్రోమైసిన్‌, బ్లీచింగ్‌ పౌడర్‌, ఎయిడ్స్‌ మందులు వంటివి తొలగించే జాబితాలో ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. మెరుగైన ప్రత్యామ్నాయాలు రావడం, మరికొన్ని వాడుకలో లేకపోవడం వంటి కారణాల రీత్యా వాటిని ఎన్‌ఎల్‌ఇఎం నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు అధికారి వివరించారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని