Pegasus: లిస్ట్‌లో రాహుల్‌ ఫోన్‌ నంబర్లు

తాజా వార్తలు

Updated : 19/07/2021 18:14 IST

Pegasus: లిస్ట్‌లో రాహుల్‌ ఫోన్‌ నంబర్లు

ప్రశాంత్‌ కిశోర్‌, ఐటీ మంత్రి అశ్వినీ ఫోన్‌నంబర్లు కూడా..

దిల్లీ: దేశంలో తీవ్ర దుమారం రేపుతున్న హ్యాకింగ్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘పెగాసస్‌’ లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో కీలక నేతలు, ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, మాజీ సీఈసీ అశోక్‌ లావాసా ఫోన్‌ నంబర్లు హ్యాకింగ్‌ టార్గెట్‌ జాబితాలోఉన్నట్టు ‘ది వైర్’ తాజాగా మరో కథనం వెల్లడించింది. 

పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికి పైగా భారతీయలున్నట్లు ‘ది వైర్‌’ వార్తా సంస్థ నిన్న ప్రచురించిన విషయం తెలిసిందే. అందులో కొందరి పేర్లను నేడు బయటపెట్టింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఉపయోగించిన కనీసం రెండు ఫోన్‌ నంబర్లు ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. రాహుల్‌కు అత్యంత సన్నిహితులైన ఐదుగురి ఫోన్‌ నంబర్లు కూడా ఇందులో ఉన్నట్లు తెలిపింది. అయితే 2018-19 రాహుల్‌ ఉపయోగించిన ఫోన్లు ఇప్పుడు ఆయన వద్ద లేవు. దీంతో ఆ ఫోన్లను ఫోరెన్సిక్‌ నిపుణులు విశ్లేషించలేదు. అలాంటప్పుడు రాహుల్‌ ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందా లేదా అన్నదాన్ని స్పష్టంగా చెప్పలేమని సదరు పత్రిక తమ కథనంలో పేర్కొంది. అయితే ఆయన సర్కిల్‌లో ఉన్న కనీసం 9 మంది నంబర్లు లక్షిత జాబితాలో ఉన్నట్లు తెలిపింది. 

పీకే ఫోన్‌ హ్యాక్‌..

ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఫోన్‌ను పెగాసస్‌తో హ్యాక్‌ చేసి ఉంటారని సదరు సంస్థ మరో కథనం రాసుకొచ్చింది. పీకే ఫోన్‌ను ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించగా.. కనీసం ఒకసారి హ్యాక్‌ అయి ఉంటుందని గుర్తించినట్లు సమాచారం. ఆయనతో పాటు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, మాజీ సీఈసీ అశోక్‌ లావాసా, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, ప్రహ్లాద్‌ పటేల్‌, పీకే సన్నిహితుల ఫోన్‌ నంబర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. 

కాగా.. పెగాసస్‌తో హ్యాకింగ్‌ వ్యవహారంపై కథనాలు ఉద్దేశపూర్వకంగా వస్తున్నవే అని కేంద్ర ఐటీశాఖ మంత్రి ఈ రోజు మధ్యాహ్నం లోక్‌సభలో తెలిపారు. హ్యాకింగ్‌ జరిగినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఇది జరిగిన కొద్ది గంటలకే ఆయన పేరు కూడా లక్షిత జాబితాలో ఉన్నట్లు రావడం గమనార్హం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని