Indian Railways: కరోనా మహమ్మారితో..రైల్వేకు రూ.36 వేల కోట్ల నష్టం..!

తాజా వార్తలు

Published : 22/08/2021 21:23 IST

Indian Railways: కరోనా మహమ్మారితో..రైల్వేకు రూ.36 వేల కోట్ల నష్టం..!

ముంబయి: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై పడిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారతీయ రైల్వే కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. కరోనా విజృంభణ వేళ.. భారతీయ రైల్వే దాదాపు రూ.36వేల కోట్ల నష్టాన్ని చవిచూసిందని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రావుసాహెబ్‌ ధన్వే వెల్లడించారు. అయితే, ఇదే సమయంలో రైల్వేకు నిజమైన ఆదాయ వనరులుగా గూడ్స్‌ రైళ్లు నిలిచాయని పేర్కొన్నారు.

‘ప్యాసింజర్‌ రైళ్ల విభాగం ఎప్పుడూ నష్టాల్లోనూ కొనసాగుతుంది. టికెట్‌ ధరలు పెంచితే ప్రయాణికులపై భారం పడుతుంది. అందుకే దాన్ని అమలు చేయలేము. తాజాగా కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో భారతీయ రైల్వే రూ.36వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది’ అని మహారాష్ట్రలో ఓ రైల్వే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే సహాయమంత్రి రావుసాహెబ్‌ ధన్వే పేర్కొన్నారు. ఈ సమయంలో గూడ్స్‌ రైళ్లు ప్రధాన పాత్ర పోషించాయని.. ప్రజలకు సరుకు రవాణాలో ఎంతో దోహదపడ్డాయని చెప్పారు. ఇక బులెట్‌ రైలుపై మాట్లాడిన ఆయన.. ముంబయి-నాగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌వే వెంబడే బుల్లెట్‌ రైలు నిర్మాణం చేపట్టే అవకాశం ఉందన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని