Mumbai: ముంబయిని ముంచెత్తిన వాన 

తాజా వార్తలు

Updated : 16/07/2021 12:47 IST

Mumbai: ముంబయిని ముంచెత్తిన వాన 

భారీ వర్షంతో నదులను తలపిస్తున్న రహదారులు

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయి భారీ వర్షంతో తడిసిముద్దయింది. శుక్రవారం తెల్లవారుజామున నుంచి కురిసిన వర్షం కారణంగా నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రైల్వే ట్రాక్‌లపై నీరు చేరడంతో లోకల్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఉదయం దాదాపు మూడు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో జుహూలో 136 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే నగర శివారుల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తూర్పు ముంబయిలోని చాలా ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపైకి నీరు చేరింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని లోకల్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రానున్న 24 గంటల్లో ముంబయి, ఠాణె, ఇతర మహారాష్ట్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక సాయంత్రం సయమంలో ముంబయి తీరంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశమున్నట్లు తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని