Mumbai: ముంబయి, థానెలో రెడ్ అలర్ట్‌

తాజా వార్తలు

Published : 21/07/2021 19:31 IST

Mumbai: ముంబయి, థానెలో రెడ్ అలర్ట్‌

ఆర్థిక రాజధాని నగరాన్ని ముంచెత్తుతున్న వానలు

ముంబయి: ఆర్థిక రాజధాని నగరం ముంబయిని వానలు ముంచెత్తున్నాయి. దాంతో ఎక్కడికక్కడ నీరు నిలిచి, రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ముంబయి, థానె, పాల్ఘర్‌కు భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ‘గత ఆరు గంటలుగా ముంబయిలోని చాలా ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబయి, థానె, పాల్ఘర్, రాయ్‌గఢ్‌లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చు’ అని వాతావరణ శాఖ ట్వీట్ చేసింది. గురువారం కూడా వానలు తెరిపినిచ్చే సూచనలు కనిపించడం లేదని అంచనా వేసింది. అఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆదివారం నుంచి కురుస్తోన్న వానల కారణంగా.. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని బీఎంసీ నగరవాసులకు సూచించింది. ఈ వర్షాల వల్ల చోటుచేసుకున్న పలు ఘటనల్లో 33 మంది మరణించారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని