రష్యాలో ప్రయాణికుల విమానం మిస్సింగ్‌

తాజా వార్తలు

Published : 16/07/2021 17:29 IST

రష్యాలో ప్రయాణికుల విమానం మిస్సింగ్‌

మాస్కో: రష్యాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ విమానం ఆచూకీ గల్లంతైంది. టామ్స్క్‌ ప్రాంతంలోని కెడ్రోవ్‌ నుంచి 17 మంది ప్రయాణికులతో బయల్దేరిన అంటనోవ్‌ An-28 విమానం సైబీరియా ప్రాంతంలో రాడార్లతో సంబంధం తెగిపోయినట్లు రష్యన్‌ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలయ్యాయి. ప్రయాణ సమయంలో 13 నుంచి 17 మంది వరకు ఉన్నారని వివిధ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఇటీవల Antonov An-26 అనే ప్రయాణికుల విమానం 28 మంది ప్రయాణికులతో కుప్పకూలిన 10 రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని