నేను డ్రగ్స్ విక్రేతనుకాదు.. జోనల్ స్థాయి అధికారిని మాత్రమే..

తాజా వార్తలు

Updated : 29/10/2021 11:38 IST

నేను డ్రగ్స్ విక్రేతనుకాదు.. జోనల్ స్థాయి అధికారిని మాత్రమే..

అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బాంబే హైకోర్టుకు వాంఖడే.. పిటిషన్‌ కొట్టివేత

ముంబయి: క్రూజ్ నౌక డ్రగ్స్‌ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే గురువారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబయి పోలీసులు తనని అరెస్టు చేస్తారనే ఆందోళనతో కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అయితే, ఆయన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

నేను జోనల్ ఇంఛార్జిని.. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ విడుదలకు అతడి తండ్రి షారుక్ ఖాన్ నుంచి డబ్బు డిమాండ్ చేసినట్లు సమీర్ వాంఖడేపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముంబయి పోలీసులు తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని, దర్యాప్తు నుంచి ఊరట కల్పించాలని ఆయన కోర్టును కోరారు. ఒకవేళ, దర్యాప్తు కొనసాగించాలనుకుంటే.. ఈ కేసును సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు అప్పగించాలని తన పిటిషన్‌లో వెల్లడించారు. ‘వారు నన్ను గనుక అరెస్టు చేస్తే.. చట్టమే నన్ను రక్షిస్తుంది. నేను డ్రగ్స్‌ అమ్మకందారుడిని కాదు. ఒక సంస్థకు జోనల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా’ అని అందులో పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. వాంఖడేపై నాలుగు ఫిర్యాదులు అందాయని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైందని, ఏసీపీ స్థాయి అధికారి ఈ కేసుకు నేతృత్వం వహిస్తారని చెప్పారు. ప్రస్తుతానికి తాము ఆయనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు. ఈ ఆరోపణలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తున్నందున.. తాము కేసు రిజిస్టర్ చేయడానికి 72 గంటల ముందు నోటీసు ఇస్తామని వెల్లడించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని