Mi-24 helicopter: అఫ్గాన్‌లో అరాచకం.. తాలిబన్ల చెరలో భారత హెలికాప్టర్‌

తాజా వార్తలు

Published : 12/08/2021 14:43 IST

Mi-24 helicopter: అఫ్గాన్‌లో అరాచకం.. తాలిబన్ల చెరలో భారత హెలికాప్టర్‌

2019లో అఫ్గాన్‌కు బహూకరించిన భారత్‌

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. తాలిబన్ల బాంబు దాడుల్లో సాధారణ ప్రజానీకం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పిల్లలు, మహిళలు సహా వేల సంఖ్యలో పౌరులు మరణిస్తున్నారు. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అఫ్గాన్‌ సైన్యానికి భారత్‌ బహూకరించిన ఎంఐ-24 యుద్ధ హెలికాప్టర్‌ తాలిబన్ల నియంత్రణలోకి వచ్చినట్టు తెలుస్తోంది.

అఫ్గాన్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకొనేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా వారు కండుజ్‌ విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడే భారత్‌ బహూకరించిన ఎంఐ-24 హెలికాప్టర్‌ ఉంది. దాని వద్ద తాలిబన్లు తీసుకున్న చిత్రాలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే.. ఆ హెలికాప్టర్‌ గాలిపంకలు (రొటర్‌ బ్లేడ్స్‌) కనిపించడం లేదు. ముందు జాగ్రత్తగా అఫ్గాన్‌ రక్షణ దళాలు వాటిని తొలగించినట్లు తెలుస్తోంది.

2019లో అఫ్గాన్‌ వైమానిక దళానికి భారత్‌ ఈ ఎంఐ-24 హెలికాప్టర్‌ను బహూకరించింది. దాంతో పాటు మూడు చీతా తేలికపాటి హెలికాప్టర్లనూ ఇచ్చింది. కాగా ఇప్పటికే ఆ దేశాన్ని 65% తాలిబన్లు ఆక్రమించారు. స్థానికులు వారితో పోరాడలేకపోతున్నారు. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికా తమ సైన్యాన్ని ఉపసంహరించడంతో తాలిబన్ల అరాచకాలు మళ్లీ  మొదలయ్యాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని