Rahul Gandhi: రాహుల్‌ ట్విటర్‌ ఖాతా పునరుద్ధరణ

తాజా వార్తలు

Updated : 14/08/2021 12:25 IST

Rahul Gandhi: రాహుల్‌ ట్విటర్‌ ఖాతా పునరుద్ధరణ

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ఖాతాను ఆ సంస్థ పునరుద్ధరించింది. దిల్లీలో హత్యాచారానికి గురైన ఒక దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆ చిత్రాలను పంచుకున్నందుకు ఆయన ఖాతాను ట్విటర్‌ గతవారం తాత్కాలికంగా స్తంభింపజేసిన విషయం తెలిసిందే. నిబంధనలను ఉల్లంఘించినందుకే రాహుల్‌ ఖాతాను బ్లాక్‌ చేసినట్లు సంస్థ తెలిపింది. తాజాగా ఆయన ఖాతాను ట్విటర్‌ అన్‌లాక్‌ చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. రాహుల్‌తో పాటు పార్టీ నేతల అందరి ఖాతాలను కూడా పునరుద్ధరించినట్లు తెలిపింది. కాగా.. ట్విటర్‌ చర్యను వ్యతిరేకిస్తూ రాహుల్‌ తీవ్ర విమర్శలు గుప్పించిన మరుసటి రోజే సంస్థ వారి ఖాతాలను పునరుద్ధరించడం గమనార్హం. 

తన ఖాతాను నిలిపివేయడంపై రాహుల్‌ గాంధీ నిన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. ట్విటర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తోందని, దేశ రాజకీయ ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. మన రాజకీయాలపై ఆ కంపెనీ వ్యాపారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. ఈ మేరకు యూట్యూబ్‌ వేదికగా ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు.

ఇదిలా ఉండగా.. ట్విటర్‌ ఇండియా అధిపతిగా ఉన్న మనీశ్‌ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేస్తూ ఆ సంస్థ నిన్న అనూహ్య నిర్ణయం తీసుకుంది. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న వీడియోకు సంబంధించి యూపీలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆయన బదిలీకి కారణమేమిటనేది ట్విటర్‌ వెల్లడించలేదు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని